ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా, బుధవారం మొదటి రోజు నామినేషన్లు ప్రశాంతంగా జరిగాయని మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ తెలిపారు. మున్సిపల్ పరిధిలోని 12 వార్డులకు గాను మొదటి రోజు 2వ వార్డులో 1, 8వ వార్డులో 1 చొప్పున మొత్తం రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లను స్వీకరించడానికి 4 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ వెల్లడించారు.