కామారెడ్డి: కుంటలో పడి జాలరీ మృతి

కామారెడ్డి సెగ్మెంట్ బీబీపేట్ పెద్ద చెరువులో సమీప కుంటలో చేపల వేటకు వెళ్లిన గుర్రం లక్ష్మణ్ (40)మృతి చెoదినట్లు పోలీసులు తెలిపారు. చేపల వేటకు వెళ్లి రాకపోయే సరికి రాత్రి నుండి కుటుంబ సభ్యులు వెతికగా, శనివారం ఉదయ కుంట దగ్గర చెప్పులు, సైకిల్ కనిపించడంతో కుటుంబీకులు అక్కడి కుంటలో వలవేసి చూడగా వలకు చిక్కిన లక్ష్మణ్ శవాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్