అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన మాజీ ఏఎంసీ చైర్మన్

ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రజిత భర్త, మాజీ ఏఎంసీ చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి అనారోగ్యంతో జూబ్లీహిల్స్ లోని ఈఎన్టీ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు గొంతు శస్త్రచికిత్స జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు బుధవారం ఆసుపత్రికి వెళ్లి వెంకట్ రాంరెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఆయన ఏఎంసీ చైర్ పర్సన్ తో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే వెంట మాజీ ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మెన్ కుడుముల సత్యనారాయణ ఉన్నారు.

సంబంధిత పోస్ట్