నిజామాబాద్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ కుటుంబం అమెరికాలో ఘోర కారు ప్రమాదానికి గురైంది. ఆయన భార్య డాక్టర్ సుచీ యాష్కీ తీవ్రంగా గాయపడ్డారు. కుమార్తె గగనను మెడిసిన్ ఉన్నత చదువుల కోసం అమెరికాలో కాలేజీలో చేర్పించేందుకు వెళ్లినప్పుడు ఈ ప్రమాదం జరిగింది. కూతురి అడ్మిషన్ ప్రక్రియ పూర్తయ్యాక, బోస్టన్ నుంచి న్యూయార్క్ తిరిగి వెళ్తుండగా, భారీ వర్షం కారణంగా కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో మాజీ ఎంపీ భార్య, కూతురు గాయపడినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.