ఎల్లారెడ్డి: నర్సింలుకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసిన మాజీ ఎంపీ

ఎల్లారెడ్డి మండల బీజేపీ అధ్యక్షుడు నర్సింలు అక్రమంగా రోడ్డు కబ్జా చేసి ఇంటిని నిర్ణించాడని సంబంధిత అధికారులు భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఇంటిని కూల్చివేసిన విషయం పాఠకులకు విధితమే. సమాచారం అందుకున్న జహీరాబాద్ సెగ్మెంట్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ హుటాహుటిన మల్కాపూర్ గ్రామాన్ని ఆదివారం సందర్శించారు. కూల్చి వేయబడిన నర్సింలు ఇంటిని చూసి ఆగ్రహం వ్యక్తం చేసారు. నర్సింలుకు వెంటనే లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు.

సంబంధిత పోస్ట్