వడ్ల వ్యాపారిని బెదిరించిన నలుగురు జర్నలిస్టుల అరెస్ట్

కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డిలో వడ్ల లోడ్‌తో వెళ్తున్న లారీని అడ్డగించి, రూ. 1.20 లక్షలు ఇవ్వాలని బెదిరించిన నలుగురు బాన్సువాడ జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్ద శంకరంపేట్ మండలం బూరుగుపల్లికి చెందిన వడ్ల వ్యాపారి సకినాల సురేందర్, తన వడ్లను ఆంధ్రప్రదేశ్‌లోని సాయిరాం రైస్ ఇండస్ట్రీస్‌కు లారీలో పంపుతుండగా, 26వ తేదీ రాత్రి మల్లాయిపల్లి సమీపంలో ఎం. డి. అబ్దుల్ మోసిన్, గాండ్ల సుధీర్, ఎడ్ల మహేష్, బుడ్డి ఆనంద్ అనే జర్నలిస్టులు లారీని అడ్డగించి, డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕