ఉచిత బస్సు పథకం మహిళల ఆర్థిక, సామాజిక భద్రతకు భరోసా

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వన్ మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు రాష్ట్రంలో 290 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసి 10వేల కోట్ల ప్రయాణ చార్జీలను ఆదా చేసుకున్నారని తెలిపారు. ఈ పథకం మహిళల ఆర్థిక, సామాజిక భద్రతకు, బలమైన భరోసా అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మహిళా ప్రయాణికులను సత్కరించారు. మహాలక్ష్మి పథకం మహిళల ఆర్థిక భారం తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తోందని, దీని ద్వారా మహిళలు స్వేచ్ఛగా ప్రయాణాలు చేస్తూ పనులు చేసుకుంటున్నారని ఆయన వివరించారు.

సంబంధిత పోస్ట్