జనవరి 30న మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా బీబీపేట్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో బస్టాండు వద్ద గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు మురికి శ్రీనివాస్, కార్యదర్శి రెడ్డి శెట్టి శ్రీనివాస్, కోశాధికారి జుర్రీగల శ్రీనివాస్, వైస్ గవర్నర్ బాశెట్టి నాగేశ్వర్, జోన్ చైర్మన్ తుడుపునూరి నాగభూషణం, గ్రామ సర్పంచ్ ఉప్పల సాత్విక సాయినాథ్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పబ్బ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.