జలాల్ పూర్ లో ప్రశాంతంగా గణేష్ నిమజ్జన వేడుకలు

నాగిరెడ్డిపేట్ మండలం జలాల్ పూర్ లో యువ గణేష్ యూత్, గల్లీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో కొలువుదీరిన వినాయకుల నిమజ్జనం వేడుకలు మంగళవారం రాత్రి ప్రారంభమై బ్యాండ్ మేళాలతో యువకుల నృత్యాలతో సందడి చేస్తూ గ్రామంలోని ప్రధానవీధుల గుండా శోభాయాత్ర నిర్వహించి బుధవారం గ్రామ శివారులోని పోచారం ప్రధాన కాలువలో వినాయకుల నిమజ్జనంను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తి చేశారు. సర్పంచ్ నిజాంపేట శ్రీనివాస్ గౌడ్ గణేష్ నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణేష్ మండలి సభ్యులు వారిని శాలువాతో సత్కరించి సన్మానించారు. గణేష్ నిమజ్జన వేడుకలను సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించినందుకు వారిని అభినందించారు.

సంబంధిత పోస్ట్

✕
✕