బీర్కూర్‌లో ఉరేసుకొని ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య

శనివారం బీర్కూర్ పోలీసుల కథనం ప్రకారం, బాన్సువాడ సెగ్మెంట్ బీర్కుర్ మండలంలోని బైరాపూర్ గ్రామానికి చెందిన పందుల సాయిలు అనే ప్రభుత్వ ఉద్యోగి, నీటి పారుదల శాఖలో పనిచేస్తున్నాడు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సాయిలు, వైద్యం చేయించుకున్నా తగ్గకపోవడంతో శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్