అగ్నిప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది

కామారెడ్డి పాత బస్ స్టాండ్ వద్ద అగ్నిప్రమాదంలో దుకాణాలు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ హామీ ఇచ్చారు. ఆయన కాలిపోయిన దుకాణాలను పరిశీలించి, బాధితుల పరిస్థితిని అడిగి తెలుసుకొని ఓదార్చారు. ఈ క్లిష్ట సమయంలో మీరు ఒంటరిగా లేరని, ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. తక్షణ ఉపశమనంగా 21 మంది బాధితులకు దాదాపు రూ. 2 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాల్ చైర్మన్ ఇప్ప ఉమారాణి, మాజీ డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు సందీప్, మాజీ పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్