తెలంగాణ రాష్ట్ర జాగృతి పార్టీ అధ్యక్షురాలు కవితక్కను కామారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో నాగిరెడ్డిపేట మండలంలోని ఆత్మకూరు గ్రామ గౌరీగారి సుభాన్ రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, తెలంగాణ జాగృతి పార్టీ నాగిరెడ్డిపేట్ మండల అధ్యక్షులుగా గౌరీగారి సుభాన్ రెడ్డిని నియమించినట్లు తెలంగాణ జాగృతి పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎదురుగట్ల సంపత్ గౌడ్ తెలిపారు. ఈ నియామకం పార్టీ కార్యకలాపాల్లో కీలక మార్పులకు దారితీయనుంది.