తాడ్వాయి మండల పార్టీ అధ్యక్షులు జుకంటి వెంకట్ రెడ్డి, ఏఎంసీ. వైస్ ఛైర్మెన్ జక్కుల రాజిరెడ్డి, సోమారం మజీ సర్పంచ్ చరణ్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ మోహన్ ను బుధవారం కలుసుకున్నారు. ఈ సందర్బంగా వారు శాలువాతో ఎమ్మెల్యేను సత్కారించి సొసైటీ గోదాం మంజూరు, సోమారం గ్రామ బతుకమ్మ వాగు బ్రిడ్జికి నిధులు మంజూరు చేయాలనీ కోరారు. దానికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి త్వరలోనే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.