నీటి ఎద్దడి నివారణకు హ్యాండ్ బోర్ మరమ్మత్తులు..

ఎల్లారెడ్డి మండలంలోని వెంకటాపూర్ గ్రామ శివారులో ఉన్న పంగిడి మైసమ్మ ఆలయం వద్ద, గత 2-3 ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న హ్యాండ్ బోర్ ను గ్రామ సర్పంచ్ అయ్యల సాయిలు ప్రత్యేక చొరవతో శనివారం మరమ్మత్తులు చేయించారు. శ్రీరామనవమి, దశిమి సందర్భంగా ఆదివారం జరగనున్న బోనాల పండుగ సందర్భంగా భక్తులకు నీటి ఇబ్బంది కలగకుండా ఈ మరమ్మత్తులు చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు. దీంతో హ్యాండ్ బోర్ ను తిరిగి ఉపయోగంలోకి తీసుకువచ్చారు.

సంబంధిత పోస్ట్