గణేష్ నిమజ్జనంలో హృదయాకారంలో తేలిన పూలమాల

కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ తాండలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు బుధవారం గణేష్ నిమజ్జనంతో ముగిశాయి. నిమజ్జనం సందర్భంగా, భక్తులు వినాయక విగ్రహాన్ని జలంలో నిమజ్జనం చేసిన అనంతరం, గణనాథుడి మెడలో వేసిన పూలమాల నీటిపై హృదయాకారంలో తేలియాడటం భక్తులను ఆకట్టుకుంది. విగ్రహం నీటిలో కలిసిపోయిన తర్వాత కూడా పూలమాలలు విడిపోకుండా ఒకచోట చేరి హృదయ ఆకారాన్ని పోలి కనిపించాయి. ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన భక్తులు ఆసక్తిగా వీక్షిస్తూ వెళుతూ వెళుతూ గణేష్‌ లవ్ యూ చెప్పినట్టుంది” అంటూ భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. గణేష్ మహారాజ్ కీ జై అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕