ఎల్లారెడ్డి పట్టణంలో గురువారం ఉదయం నుండి మండుటెoడ వేడితో జనాలు అల్లాడిపోయారు. సాయంత్రం3 గంటలకు ఒక్కసారిగా ఎండ పోయి ఆకాశం నల్లగా మారడం మొదలై ఉరుములు, మెరుపులు, పిడుగుల చప్పుళ్లతో భారీ వర్షం మొదలైంది. నాలుగురోజుల క్రితం వర్షాలు పడి, 3రోజులుగా ఎండప్రతాపం చూపింది. ఒక్కసారిగా వరుణుని కరుణతో ఊహించని రీతిలో వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది. ఈ వర్షంతో ఇక శుక్రవారం నుండి రైతులంతా పొలాల పనుల్లో బిజీనే.