కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం హోలీ పండుగ సందడి నెలకొంది. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పోలీస్ సిబ్బందితో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. అధికారులు, సిబ్బంది ఎస్పీకి రంగులు పూసి, ఆనందంగా పండుగను జరుపుకున్నారు. ఎస్పీ రాజేష్ చంద్ర జిల్లా ప్రజలకు, పోలీసు సిబ్బందికి హోలీ శుభాకాంక్షలు తెలిపారు.