ఎల్లారెడ్డి సెగ్మెంట్ లోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, లింగంపేట్, గాంధారి, సదాశివనగర్, తాడ్వాయి, రామారెడ్డి మండలాల్లోని అన్ని గ్రామాల్లో ప్రజలు హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుండి చిన్న, పెద్ద తేడా లేకుండా యువతీ, యువకులు, మహిళలు, పెద్దలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని సంబరాలు చేసుకున్నారు. చిన్నారులు జాజిరి పాటలు, ఆటలతో అలరించారు. మండల కేంద్రాలు, గ్రామాలన్నీ రంగులమయంగా మారి సందడిగా మారాయి. నాయకులు, అధికారులు, పోలీసులు కూడా కలిసి హోలీని ఆస్వాదించారు.