ఏకగ్రీవ సర్పంచ్ కు సత్కారం

నాగిరెడ్డిపేట మండలం పల్లెబోగుడా తాండ గ్రామ సర్పంచ్ ధరావత్ పార్వతి శంకర్ నాయక్, పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవం కావడంతో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అధ్యక్షులు దేవిసోత్ రమేష్ నాయక్ సర్పంచ్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రమేష్ నాయక్ మాట్లాడుతూ, తాండవాసులందరూ ఏకగ్రీవంగా సర్పంచిని, పాలకవర్గాన్ని ఎన్నుకోవడం ఆనందంగా ఉందని, ఇది గ్రామానికి శుభప్రదం అని, దీనివల్ల రాజకీయ గొడవలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉంటారని తెలిపారు.

సంబంధిత పోస్ట్