ఎల్లారెడ్డి మండలం అన్నసాగర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలో ఉత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినులను మంగళవారం గ్రామ సర్పంచ్ స్రవంతి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో నీహారిక (534/600), అక్షయ (531/600) మార్కులు సాధించినందుకు గ్రామ ప్రజల తరపున అభినందనలు తెలిపారు. పాఠశాలలో విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు.