కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సెగ్మెంట్ కు చెందిన బీజేపీ రాష్ట్ర నేత, జపాన్ శాస్త్రవేత్త డా. పైడి ఎల్లారెడ్డి తన జన్మదిన వేడుకల్లో మాట్లాడుతూ, తాను రాజకీయాల కోసం కాకుండా, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. తన సొంత నిధులతో ఇప్పటికే చేస్తున్న అభివృద్ధి పనులను ఆయన వివరించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే, ప్రజలకు మరింత అభివృద్ధి చేసేవాడినని అన్నారు.