రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గుర్తించండి

ఎల్లారెడ్డి మండలంలోని 31 గ్రామ పంచాయతీల పరిధిలో రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను పారదర్శకంగా గుర్తించాలని ఎంపీడీఓ తహెరా బేగం అన్నారు. శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశాల మేరకు గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ఆమె ఈ సూచనలు చేశారు. గుడిసెలో నివాసం ఉంటున్న అర్హులైన లబ్ధిదారులను సోమవారం లోగా గుర్తించి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్