ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం: నిరుపేదల కలలు నెరవేర్చిన ఎమ్మెల్యే

కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగిరెడ్డిపేట్ మండలం లింగంపల్లి గ్రామంలో బుధవారం నాడు నాయికోటి రుక్కవ్వ రాములుల ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. సర్పంచ్ టి అనిత గోపాల్ గౌడ్ రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నందుకు లబ్ధిదారులు ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అర్హులైన నిరుపేదలకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్