ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో శనివారం జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశంలో, మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పుకున్నారు. వేముల ప్రశాంత్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ, అందరూ కలిసికట్టుగా పోరాడి, కేసీఆర్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకొని, పచ్చటి తెలంగాణను కాపాడుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.