కలెక్టరేట్లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవము

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా సివిల్ జడ్జ్ నాగరాణి పాల్గొన్నారు. జిల్లాలో దివ్యాంగుల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతీ ఏడాది డిసెంబర్ 3న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్