ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట్ మండలం బాణాపూర్ తాండలో ఆదివారం అభయాంజనేయ స్వామి ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ మహోత్సవంలో జపాన్ శాస్త్రవేత్త, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా. పైడి ఎల్లారెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేసారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ జ్ఞాపికను అందించి శాలువాతో పైడిని సత్కరించింది.