కామారెడ్డిలో జాబ్ మేళా.. 121 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

కామారెడ్డి జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం జూన్ 5వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తోంది. ఈ మేళాలో ప్రైవేట్ రంగంలో 121 పోస్టులకు ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఎంపికైన వారికి హైదరాబాద్‌లో ఉద్యోగాలు లభిస్తాయి. ఐఐటీ, ఇంటర్, డిగ్రీ, హోటల్ మేనేజ్‌మెంట్ పూర్తి చేసిన 19-35 ఏళ్ల యువకులు అర్హులు. వీరికి నెలకు రూ. 18,000 నుండి రూ. 21,000 వరకు వేతనం ఉంటుంది. అర్హులైన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి కిరణ్ కుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్