ఆత్మకూరులో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లో చేరికలు

సోమవారం, నాగిరెడ్డిపేట మండలంలోని ఆత్మకూరు గ్రామానికి చెందిన 36 మంది బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కే. మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరారని గ్రామ మాజీ సర్పంచ్ గడ్డం బాల్రెడ్డి తెలిపారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ సర్పంచ్ గడ్డం బాల్రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్