ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో సదాశివ నగర్ మండలం, అమర్లబండ గ్రామ నూతన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీలో శనివారం చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్‌లు తమ విధులపై అవగాహనతో బాధ్యతాయుతంగా పనిచేయాలని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, గ్రామాల్లో రోడ్లు అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.

సంబంధిత పోస్ట్