రసవత్తరంగా సాగిన కుస్థాయి పోటీలు

నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామంలో బుధవారం మావురాల ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద ఘనంగా కుస్తీ పోటీలు నిర్వహించారు. ప్రాచీన సంప్రదాయాలను సజీవంగా నిలుపుతూ, యువతలో స్ఫూర్తిని రగిలించేలా ఈ పోటీలు ఎంతో ఉత్సాహంగా జరిగాయి. గ్రామ పెద్దల ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలను తిలకించేందుకు వివిధ గ్రామాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల నుండి కూడా పోటీదారులు పాల్గొన్నారు. ముఖ్యంగా అక్కాచెల్లెళ్లు పూర్వా ఠాక్రే, ఆబా ఠాక్రే కూడా పోటీలలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్