కామారెడ్డి జిల్లా యుద్ధ వ్యతిరేక కమిటీ నిరసన ప్రదర్శన

ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులను, యుద్ధాలను ఖండిస్తూ కామారెడ్డి జిల్లాలో యుద్ధ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన ప్రదర్శన జరిగింది. ఇజ్రాయిల్, అమెరికా దేశాలు తమ యుద్ధకాంక్షను విడనాడాలని, దేశ సార్వభౌమాధికారాలను గౌరవించాలని, లేనిపక్షంలో దురాక్రమణకు పాల్పడుతున్నాయని, ఇరాన్ పై యుద్ధం 35 రోజులుగా జరుగుతోందని జేఏసీ కన్వీనర్, యుద్ధ వ్యతిరేక కమిటీ ప్రతినిధి జగన్నాథం అడ్వకేట్ అన్నారు. కామారెడ్డి మున్సిపల్ ఎదుట ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, టిపిటిఎఫ్, డిటిఎఫ్, ఎస్టియు, లెక్చరర్స్, సిపిఐ, బహుజన సంఘాల ప్రతినిధులు ఈ నిరసనలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్