లింగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎక్కపల్లి-సజ్జనపల్లి రహదారిపై బుధవారం దకన్నా మల్లేష్ (38) అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అదుపుతప్పి బండరాయిని ఢీకొన్నాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలై మల్లేష్ అక్కడికక్కడే మృతి చెందారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు సిటిజెన్ సెంట్రిక్ అప్రోచ్ ను అమలు చేస్తూ, ఆసుపత్రి వద్దే మృతుడి భార్య నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు.