కామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో గాయపడి వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో గాయపడి.. చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన శనివారం నాగిరెడ్డిపేట మండలం బంజర గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజర గ్రామానికి చెందిన సాతెల్లీ బాలరాజ్ (38), ఎక్కలేవి అరవింద్ ఇద్దరు కలిసి జనవరి 26వ తేదీన రోడ్డు దాటే క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. గమనించిన స్థానికులు క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్