కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల విద్యార్థి జి. చంద్రశేఖర్, జిల్లా స్థాయి అథ్లెటిక్స్ జావెలిన్ త్రో పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఈ నెల 10, 11 తేదీల్లో హనుమకొండలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డా. కె. విజయ్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ డా. కె. కిష్టయ్య తదితరులు విద్యార్థిని అభినందించారు.