ఎల్లారెడ్డి పట్టణ బిజెపి ముఖ్య నాయకులు కొండంగారి (ప్యాలాల) రాములు ఆదివారం బిజెపి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఆమోదించాలని బిజెపి మండల అధ్యక్షులు పెద్దెడ్ల నర్సింలుకు విన్నవించారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాములు తెలిపారు. ఇంతకాలం సహకరించిన బిజెపి నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.