కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని మూడు గ్రామాలలో మద్య నిషేధిస్తూ ఆయా గ్రామస్తులు మంగళవారం తీర్మానం చేశారు. కోమటిపల్లి, కే. సాయిపేట, రెడ్డిపల్లి గ్రామస్థులు సమావేశం నిర్వహించి గ్రామంలో ఎవరు మద్యం అమ్మవద్దని నిర్ణయించారు. ఎవరైనా అమ్మితే జరిమానాలు విధించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆయా గ్రామాల ప్రజలందరూ సహకరించాలని కోరారు.