నాగిరెడ్దిపేటలో మహాత్మాగాంధీ వర్ధంతి

శుక్రవారం నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి, గోపాల్‌పేట్ సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి నిర్వహించారు. గాంధీజీ చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు. నాగిరెడ్డిపేటలో రోడ్డు కాంట్రాక్టర్ గాంధీ విగ్రహాన్ని తొలగించడం బాధాకరమని, వెంటనే ఆ విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాలాజీ మసూద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్