హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన మహేష్

ఎల్లారెడ్డికి చెందిన పాత్రికేయుడు మహేష్, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సమక్షంలో గురువారం హైదరాబాద్‌లో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మహేష్ తల్లి పద్మ, ఎల్లారెడ్డి మున్సిపల్ వార్డు 2వ వార్డు నుండి బీఆర్ఎస్ తరఫున పోటీ చేయడానికి ఇప్పటికే నామినేషన్ వేశారు. బీఆర్ఎస్ పార్టీ నుండి ఆమెకు బీ ఫాం కూడా లభించినట్లు సమాచారం. కాంగ్రెస్ టికెట్ ఆశించిన మహేష్, అది రాదని తెలియడంతో బీఆర్ఎస్ లో చేరినట్లు తెలిసింది. వీరితో పాటు మాజీ జడ్పీ చైర్మన్ దఫెధర్ రాజు కూడా ఉన్నారు.

సంబంధిత పోస్ట్