2వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా మహేశ్వరి నామినేషన్ దాఖల్

ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో 2వ వార్డు కౌన్సిలర్ గా అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంచిర్యాల మహేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. ఆమె తన భర్త, సీనియర్ కాంగ్రెస్ నేత విద్యాసాగర్, పార్టీ కార్యకర్తలు, మిత్రులతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు. ఈ సందర్భంగా మహేశ్వరి మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథంలో ముందుందని, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి సెగ్మెంట్ అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. అన్ని వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించి, ఎల్లారెడ్డిని ఊహించని రీతిలో అభివృద్ధి చేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్