దేవున్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం: భారీ ఆస్తి నష్టం

కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవున్ పల్లిలోని విద్యుత్ నగర్ కాలనీలో వడ్ల బాలచంద్రంకు చెందిన కార్పెంటర్ షాప్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నికి ఆహుతైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో భారీగా కలప, ఇతర సామగ్రి కాలిపోయిందని బాధితుడు తెలిపారు. రెవిన్యూ అధికారులు పంచనామా నిర్వహించిన తర్వాతే ఆస్తి నష్టం అంచనా వేయబడుతుంది. విలువైన యంత్రాలు, కలప కాలిపోవడంతో గణనీయమైన నష్టం వాటిల్లింది.

సంబంధిత పోస్ట్