12మంది కాంగ్రెస్ కౌన్సిల్లర్లను గెలిపించండి.. ఎమ్మెల్యే

ఎల్లారెడ్డి పరిధిలోని 12మంది కాంగ్రెస్ కౌన్సిలర్లను గెలిపించుకొని మున్సిపల్ పరిధిని సర్వతోముఖాభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం 12వ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఎరకల దశరథంను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ, దశరథంను గెలిపిస్తే సమగ్ర అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు. ఎమ్మెల్యే ఎల్లారెడ్డిలో రెండేళ్లలో చేసిన పనులను వివరించారు.

సంబంధిత పోస్ట్