రేవంత్ రెడ్డి మాటలకు, వాస్తవాలకు పొంతన లేదు..వేముల ప్రశాంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో 80 శాతం రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని, అయితే ఎల్లారెడ్డి సెగ్మెంట్లోని మాల్ తుమ్మెదలో 30 శాతం ధాన్యం తరలింపు జరగలేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఎల్లారెడ్డిలో జరిగిన బీఆర్ఎస్ సెగ్మెంట్ స్థాయి సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ, తాను హైదరాబాద్ నుండి వస్తుంటే దారిలో మాల్ తుమ్మెద కొనుగోలు కేంద్రం వద్ద ఇంకా 70 శాతం ధాన్యం ఉందని రైతులు చూపించారని, ఇది ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధితో ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్