ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

జుక్కల్ సెగ్మెంట్ పిట్లం మండలం చిన్నకొడఫ్గల్ శివారులో శనివారం టిక్యానాయక్ తండాకు చెందిన మెగావత్ శ్రీకాంత్ (27) అనే యువకుడు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ. ఆంజనేయులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. శ్రీకాంత్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్ట్ మార్టం చేయించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్