జుక్కల్ సెగ్మెంట్ నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువలో ఓ వ్యక్తి పడి గల్లంతైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ శివకుమార్ కథ ప్రకారం.. ఎల్లారెడ్డి మండలం అన్నసాగర్ కు చెందిన కర్రె విట్టల్ (40) మిషన్ భగీరథలో పని చేస్తుంటాడు. నిజాంసాగర్ ప్రధాన కాలువలో చేపకనపడటంతో, పట్టుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు కాలువలో పడి గల్లంతయ్యాడు. పోలీసులు కాలువ నీటిని నిలుపుదల చేయించి గాలింపు చర్యలు చేపట్టారు.