చెట్టుపై నుండి పడి తాపీ మేస్త్రికి తీవ్ర గాయాలు

ఎల్లారెడ్డి మండలం అడవిలింగాల గ్రామానికి చెందిన పిట్ల సంగమేశ్వర్, ఈ నెల 24వ తేదీన తాపీ మేస్త్రిగా పనిచేసి ఇంటికి వెళ్తూ, పిల్లల కోసం మామిడికాయలు తెంపడానికి చెట్టు ఎక్కాడు. దురదృష్టవశాత్తు చెట్టుపైనుండి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. నడుము విరిగిన సంగమేశ్వర్‌ను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఆవుటి బాబు, కార్యదర్శి అబ్దుల్ రజాక్ వెళ్లి పరామర్శించారు.

సంబంధిత పోస్ట్