ఇంటి తాళం పగులగొట్టి భారీ చోరీ: ఇద్దరి అరెస్ట్, 56 లక్షల సొత్తు స్వాధీనం

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో శుక్రవారం ఇంటి తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు చోరీ చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, రూ. 56 లక్షల విలువైన 31.2 తులాల బంగారం, 3 కిలోల వెండి, రూ. 9,700 నగదు స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి బొగ్గుగుడిసె చౌరస్తా వద్ద పట్టుకున్నారు. నిందితులు దండుగుల మైసయ్య, దండుగుల ఎల్లయ్యగా పోలీసులు తెలిపారు. మైసయ్యపై గతంలో ఆరు చోరీ కేసులు ఉన్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్

✕
✕