మందుల కొనుగోలులో 150 కోట్ల స్కాం జరిగిందంటున్న ఎమ్మెల్యే

కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కేవీ. రమణారెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. పేదలకు ప్రభుత్వ ఆసుపత్రులే దిక్కని, అలాంటి పరిస్థితుల్లో మందుల కొనుగోలులో 150 కోట్ల స్కాం జరిగిందని ఆయన ఆరోపించారు. టెండర్లలో ఎక్స్పైరీ డేట్, తయారీ కంపెనీ, సెల్ఫ్ లైఫ్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా, గడువు ముగియడానికి దగ్గరగా ఉన్న మందులను కొనుగోలు చేసి, వాటిని బయోవేస్ట్ చేసి, మళ్లీ టెండర్లు పిలిచే ప్రక్రియలో ఈ స్కాం జరిగిందని ఆయన ఆరోపించారు.

సంబంధిత పోస్ట్