కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్టేషన్ రోడ్డులో కామారెడ్డి ఫార్మసీ, సర్జికల్ స్టోర్ వారు ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దారిన పోయే వారికీ మజ్జిగను పంపిణీ చేశారు. ఎండలో ప్రయాణించే వారు ఇలాంటి ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రాలను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన కోరారు.