ఎల్లారెడ్డి సమస్యలపై డిప్యూటీ సీఎంను కలిసిన ఎమ్మెల్యే

మంగళవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి, ఎల్లారెడ్డి రహదారిలోని లింగంపల్లి ఖుర్ద్, అడ్విలింగాల్ వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల వరదల వల్ల దెబ్బతిన్న ఈ వంతెనల నిర్మాణానికి తక్షణ నిధులు అవసరమని ఎమ్మెల్యే తెలిపారు. డిప్యూటీ సీఎం నిధుల మంజూరుకు హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ఇతర అత్యవసర సమస్యలపై కూడా చర్చించారు.

సంబంధిత పోస్ట్