కొత్త కల్వర్టుకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే

కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి మండలంలోని అచ్చంపేట్ గ్రామంలో భారీ వరదలకు కొట్టుకుపోయిన కల్వర్టు స్థానంలో నూతన కల్వర్టు నిర్మాణానికి గురువారం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, DCC అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రజా పండరి, ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ కొత్త కల్వర్టు నిర్మాణం వల్ల స్థానికులకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది.

సంబంధిత పోస్ట్

✕
✕